ETV Bharat / jagte-raho

తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డి అరెస్ట్

పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీని నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు హరీశ్ రెడ్డి సహా మరో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డి అరెస్ట్
తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డి అరెస్ట్
author img

By

Published : Sep 24, 2020, 5:24 PM IST

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డిని కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని మాగుంట లే అవుట్ ప్రాంతంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసి అరెస్ట్ అయిన హరీశ్ రెడ్డి.. ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కోవూరు మండలం జమ్మి పాలెం వద్ద ఓ కారును అపహరించి పరారయ్యాడు. కిడ్నాపర్​ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సాంకేతిక సాయంతో..

హైదరాబాద్, బెంగళూరు ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రధాన నిందితుడ్ని సాంకేతిక సహాయంతో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. హరీశ్ రెడ్డితో పాటు మరో నలుగురిని సైతం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి కారు, రెండు సెల్ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్న కోవూరు పోలీసులను నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి అభినందించారు.

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.