ETV Bharat / jagte-raho

నాటు సారా ధ్వంసం.. తెలంగాణ మద్యం స్వాధీనం

రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఎక్సైజ్​, సివిల్​ పోలీసు సిబ్బంది.. నాటుసారా.. అక్రమ మద్య స్థావరాలపై దాడులు నిర్వహించారు. సారా తయారీకీ సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేశారు. రొంపిచర్ల మండలంలో తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

cougth wine
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
author img

By

Published : Dec 24, 2020, 8:19 AM IST

గుంటూరు జిల్లాలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో దిండి పంచాయతీ పరిధిలోని పరిసా వారిపాలెం, యేమినేని వారిపాలెంలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.. ఘటనా స్థలంలో సామగ్రిని స్వాధీనం చేసుకున్నరు. 36 లీటర్ల సారాను సీజ్ చేశారు. తీర ప్రాంతంలో పెరుగుతున్న సారా తయారీ, అమ్మకాలను అరికట్టేందుకు స్థానిక సివిల్, ఎక్సైజ్ పోలీసులు... కలిసి నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని ఎస్సై హరిబాబు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.

గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టవేత...

జిల్లాలోని రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. సాయిరాం అనే వ్యక్తి తన ఇంట్లో 73 వేల రూపాయలు విలువ చేసే 600 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రొంపిచర్ల ఎస్సై ఉదయ్ బాబు తెలిపారు.

అనంతపురంలో కర్ణాటక మద్యం విక్రేతల అరెస్ట్​...

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న గాండ్లపెంట మండలం కమతంపల్లికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 96 బాటిళ్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి:

'విజయవాడ కాల్ మనీ వ్యాపారుల నుంచి కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.