నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై విచారించిన హైకోర్టు.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్నందున... ఆ శాఖవారితోనే విచారణ చేయించడం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. సలాం కుటుంబ సెల్ఫీ వీడియోను పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున ఏఏజీ సుధాకకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం