ETV Bharat / jagte-raho

ఆన్‌లైన్‌ జూదం.. అప్పులపాలవుతున్న బాధితులు

ఇంటర్​నెట్​ వాడకం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరస్థులు అమాయకులను మోసం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కోవలోకి ఆన్‌లైన్‌ జూదం కూడా చేరిపోయింది. ఆన్​లైన్​ పేకాట, రమ్మీ, తీన్​పత్తిల ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే మోజులో పడి పలువురు మోసపోతున్నారు. అప్పులు చేసిన బాధితులు పెరిగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులు వెల్లడించారు.

Online rummy gambling in telengana
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/09-December-2020/9813802_557_9813802_1607468433435.png
author img

By

Published : Dec 9, 2020, 7:58 AM IST

ఆన్​లైన్ జూదం ద్వారా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. చరవాణిలు, ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లు తెరవగానే ఆన్​లైన్​లో కనిపించే పేకాట, రమ్మీ, తీన్ పత్తిల మోజులో విద్యార్థులు, యువకులు, వ్యాపారులు పడి లక్షల్లో కోల్పోతున్నారని చెబుతున్నారు.

దీంతోపాటు అప్పుల పాలవుతున్నట్లు వచ్చే ఫిర్యాదులు కూడా పెరిగాయని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించినా.. రమ్మీ కల్చర్ పేరుతో ఇంకా ఆన్​లైన్​లో కనిపిస్తూనే ఉందని.. ఆ వ్యసనానికి బలై మోసపోకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి :

వింత వ్యాధి: 'ఆరోగ్య శ్రీ' లోకి చేర్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.