ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ మోసం.. రూ. 99 వేలు మాయం - సైబర్​ క్రైం కార్వాన్​ వార్తలు

ఓఎల్​ఎక్స్​లో అమ్మకానికి ఉన్న మంచాన్ని చూశాడు ఓ వ్యక్తి. కొనుగోలు చేస్తానని యజమానికి ఫోన్​ చేసి బేరం ఆడుకున్నాడు. చివరికి మోసపోయాడు. అతనితో క్యూఆర్​కోడ్​ను స్కాన్​ చేయించుకుని రూ. 99 వేలు సైబర్​ నేరగాళ్లు దోచుకున్న ఘటన కార్వాన్​లో జరిగింది.

olx-cheating
olx-cheating
author img

By

Published : Oct 28, 2020, 10:09 PM IST

సైబర్​ మోసాలకు అడ్డుకట్ట పడట్లేదు. హైదరాబాద్​ కార్వాన్​కు చెందిన వేదాంత శేషకుమార్​.. తన ఇంట్లోని మంచం అమ్మకానికి ఉందని.. రూ. 14 వేలు ధరగా నిర్ణయించి ఓఎల్​ఎక్స్​లో ప్రకటన ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు.

మంచానికి బేరమాడి శేషకుమార్​తో క్యూఆర్​కోడ్​ను స్కాన్​ చేయించుకున్నాడు. వెంటనే అతని ఖాతాలోంచి రూ. 99 వేలు మాయమయ్యాయి. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.