ETV Bharat / jagte-raho

మెుదటి రాత్రే అనారోగ్యమన్నాడు.. తర్వాత ఇలా చెప్పాడు..!

అమెరికా సంబంధం దొరికింది అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. అడిగినంత కట్నం ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. అయితే అనారోగ్యం పేరుతో మొదటి రాత్రిని వాయిదా వేశాడు ఆ ఎన్​ఆర్​ఐ. నాలుగు రోజుల తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. వేరే అబ్బాయితో తనకు సంబంధం ఉందని... నీవు కూడా అమెరికా వచ్చి అతనితో కాపురం చేయొచ్చని చెప్పటంతో అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు కంగుతిన్నారు. గుంటూరులో జరిగిన ఈ వ్యవహారం చివరకు పోలీసుల వద్దకు చేరింది.

మెుదటి రాత్రి అనారోగ్యమన్నాడు.. తర్వాత ఇలా చెప్పాడు

author img

By

Published : Jul 27, 2020, 8:33 PM IST

Updated : Jul 28, 2020, 6:55 AM IST

మెుదటి రాత్రి అనారోగ్యమన్నాడు.. తర్వాత ఇలా చెప్పాడు

గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన సుబ్బారెడ్డికి విందుప్రియ ఒకరే కుమార్తె. తన కుమార్తెకు మంచి కుర్రాడితో పెళ్లి చేస్తే ఆమె భవిష్యత్తు బాగుంటుందని భావించారు. సంబంధాలు వెదికే క్రమంలో గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన భాస్కరరెడ్డి గురించి తెలిసింది. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని లక్షల్లో జీతం వస్తోందని మధ్యవర్తులు చెప్పారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు కలిసి మాట్లాడుకున్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో ఈ ఏడాది మార్చి 8వ తేదిన గుంటూరులో వైభవంగా పెళ్లి జరిపించారు.

అయితే పెళ్లి తర్వాత మొదటి రాత్రి రోజున తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పి భాస్కర్ రెడ్డి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. అక్కడ కూడా అమ్మాయితో భాస్కరరెడ్డి అంటీముట్టనట్టు ఉండేవాడు. కొద్ది రోజులు చూసి విందుప్రియ భాస్కరరెడ్డిని నిలదీసింది. అప్పుడు గాని అబ్బాయి బండారం బయటపడలేదు. తాను సంసారానికి పనికిరానని తేల్చిచెప్పాడు. అంతకు మించి ఆశ్చర్యపోయేలా మరో నిజాన్ని బయటపెట్టాడు. అమెరికాలో తాను వేరే అబ్బాయితో సహజీవనం చేస్తున్నానని... అక్కడకు వెళ్లాక ముగ్గురం కలిసి ఉండొచ్చని విచిత్ర కోరికల్ని బయటపెట్టాడు. భర్త విషయం తెలిసి... ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయింది.

బాధితులపై అబ్బాయి కుటుంబం దాడి

విషయం ఆమె తల్లిదండ్రులకు చెబుతుందనే ఉద్దేశంతో పుట్టింటికి వెళ్లనీయలేదు. ఈ లోగా లాక్ డౌన్ వచ్చింది. విషయాన్ని తన తల్లిదండ్రులకు ఎలాగోలా తెలియజేసింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లి అబ్బాయిని... అతని తల్లిదండ్రుల్ని నిలదీశారు. అయితే తమ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు అమ్మాయి తల్లిదండ్రులపై భాస్కరరెడ్డితోపాటు అతని కుటుంబసభ్యులు దాడి చేశారు. ఈనెల 21న అమెరికా వెళ్తున్నట్లు చెప్పి భాస్కరరెడ్డి వెళ్లిపోయాడు. అయితే విదేశాలకు విమానాలు లేని పరిస్థితుల్లో ఎలా వెళ్తారని అడిగినా దానికి సమాధానం లేదు. ఇపుడు కూడా అదనపు కట్నం కోసం భాస్కరరెడ్డి తల్లిదండ్రులు వేధిస్తున్నారని విందుప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము విడాకులు కోరుకోవటం లేదని బాధితులు అంటున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అమ్మాయితో పాటు తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అబ్బాయికి కట్నంగా 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం ఇచ్చినట్లు తెలిపారు. బంగారు నగల్ని భాస్కరరెడ్డి సోదరి లాగేసుకుందని ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి భాస్కరరెడ్డితో పాటు అతని కుటుంబంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు దిశ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి

Last Updated : Jul 28, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.