మునగపాక మండలం చిన్నోడుపాలెం గ్రామానికి చెందిన నాయుడు, నాగమణి దంపతులు. వీరికి విష్ణువర్థన్(9నెలలు) సంతానం. విష్ణువర్థన్ ఆధార్ కార్డ్ నమోదుకు ద్విచక్రవాహనంపై కశింకోటకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా... కశీంకోట జాతీయ రహదారి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిన్నారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విష్ణువర్థన్ మృతి చెందాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో నాయుడు, నాగమణి రోదించిన తీరు పలువురిని కట్టతడి పెట్టించింది.
ఇదీ చదవండి: జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు