ETV Bharat / jagte-raho

తాగిన మైకంలో కానిస్టేబుల్ బూతు పురాణం... వీడియో వైరల్ - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు

దీపావళి వేళ టపాసులు కాల్చుతూ సంబురంగా పండుగ జరుపుకుంటున్న యువకులపై ఓ కానిస్టేబుల్ బూతుల వర్షం కురిపించారు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ హల్​చల్​ చేశారు. 'నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అంటూ తాగిన మైకంలో వీరంగం చేశారు. కానిస్టేబుల్ బూతు పురాణం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

nagar-kurnool-police-constable-obscene-terminology-video-viral

author img

By

Published : Nov 16, 2020, 3:50 PM IST

దీపావళి పండగ వేళ టపాసులు కాలుస్తూ ఉన్న యువకులను తాగిన మైకంలో కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో దూషించారు. పోలీసు మాట్లాడిన బూతుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో రామాలయం దేవాలయం సమీపంలో కొందరు యువకులు దీపావళి సందర్భంగా పటాకులు కాలుస్తూ ఆనందంగా సంబురాలు జరుపుకుంటున్నారు. అంతలో పట్టణానికి చెందిన శివశంకర్ అనే కానిస్టేబుల్ తప్ప తాగి వచ్చి వీరంగం చేశారు. దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ హల్ చల్ చేశారు.

ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా?

యువకులు, స్థానికులు ఆయనకి నచ్చజెప్పినా వినకుండా వారితో వాదించారు. 'ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి... నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అని అసభ్య పదజాలంతో బూతులు మొదలు పెట్టారు. స్థానికంగా ఉన్న యువకులు కానిస్టేబుల్ తిట్ల పురాణాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు? కానిస్టేబుల్​పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాగిన మైకంలో కానిస్టేబుల్ బూతు పురాణం... వీడియో వైరల్

స్పందించిన ఎస్పీ

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సాయిశేఖర్ స్పందించారు. కానిస్టేబుల్ శివశంకర్‌ను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ఆయన ప్రకటించారు.

ఇదీ చదవండి:

నంద్యాల ఘటన.. పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.