ETV Bharat / jagte-raho

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. కుమార్తె ఫిర్యాదుతో వెలుగులోకి.. - east godavari crime news

నిండు నూరేళ్లు కలిసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచి.. క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. వివాహేతర సంబంధాలు.. హత్యలకు దారితీస్తున్న ఉదంతాలు... ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇలాంటి ఘటనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సహకారంతో భర్త‌ను హతమార్చింది ఓ వివాహిత. ఆమె కుమార్తె ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Murder Case Repostmartam in eastgodvari
ప్రియుడి సహకారంతో భర్తను హతమార్చిన భార్య
author img

By

Published : Jun 27, 2020, 10:36 AM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారి మెరకలో హత్యకు గురైన ప్రసాద్‌ మృతదేహాన్ని రీపోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈనెల 2న ప్రసాద్‌ గుండె నొప్పితో మరణించినట్లు భావించి అతడిని ఖననం చేశారు. స్వయంగా మృతుని కుమార్తె మేరీజెస్లీ తన తల్లి, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రసాద్‌ది సహజ మరణం కాదని దర్యాప్తులో తేలింది.

ప్రసాద్‌ భార్య మేరీ ప్రశాంతి శివ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ పథకం ప్రకారం హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణలు, ఛాటింగ్‌ గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో వైద్యుల సమక్షంలో ఖననం చేసిన ప్రసాద్‌ మృతదేహానికి పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు.

నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని అమలాపురం డీఎస్పీ మాసం భాషా చెప్పారు. అక్రమ సంబంధంతో కట్టుకున్నవాడిని భార్యే కడతేర్చడం కోనసీమ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మృతుని కుమార్తె తల్లి చేసిన దారుణాన్ని బయటపెట్టడంతోనే ఈకేసు మలుపు తిరిగి దారుణం వెలుగులోకి వచ్చేలా చేసింది.

ప్రియుడి సహకారంతో భర్తను హతమార్చిన భార్య

ఇవీ చదవండి: విషాదం: గోదావరిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.