ETV Bharat / jagte-raho

ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య.. మృతదేహాలు లభ్యం - tragedy in Asnabad

ఇంట్లో చిన్న గొడవ జరిగి మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని వికారాబాద్​ జిల్లా అస్నాబాద్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

mother-commits
mother-commits
author img

By

Published : Nov 27, 2020, 2:23 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్​ జిల్లా మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన ఎల్లమ్మ(32) ఇంట్లో చిన్న గొడవ చోటు చేసుకోవటంతో మనస్తాపం చెందింది. ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్దామని చెప్పి కొడంగల్‌ మండలం అస్నాబాద్‌కు వెళ్లింది.

ఆ గ్రామంలోని పెద్దచెరువు వద్దకు పిల్లల్ని కాలినడకన తీసుకువెళ్లిన ఎల్లమ్మ.. అక్కడ వారితో కాసేపు మాట్లాడింది. అనంతరం పెద్దకూతురు రజిత(9), కుమారుడు రాజు(5)ను అకస్మాత్తుగా చెరువులో తోసేసింది. మరో పాప అనిత(7)తో పాటు దూకేందుకు ప్రయత్నించగా పాప తప్పించుకుంది. దీంతో ఎల్లమ్మ చెరువులోకి దూకింది. కొంతసేపటికి అనిత చెరువు నుంచి ఏడ్చుకుంటూ గ్రామానికి వస్తుండగా స్థానికులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో స్థానికులు చెరువులో వెతకగా రాజు మృతదేహం లభ్యమైంది. చీకటి పడటంతో గాలించేందుకు ఇబ్బందిగా మారింది. ఇవాళ గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులోంచి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల 3 ప్రాణాలు గాల్లో కలిశాయని స్థానికులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.