మతిస్థిమితం లేని కుమారుడు తల్లిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో సంచలనం సృష్టించింది. గాదరాడ గ్రామానికి చెందిన దేగపాటి ప్రకాశం కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నాడు. అతడికి మానసిక ఆస్పత్రిలో వైద్యం చేయించారు. మూడు నెలలుగా ఏ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అతడి భార్య ఏఎన్ఎం కాగా... కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రకాశం తల్లి నవరత్నం ఏడాది కాలంగా ఆనారోగ్యంతో మంచం పట్టింది. ఈ క్రమంలో మతిస్థిమితం లేని కుమారుడు ప్రకాశం... శీతల పానీయంలో గుళికలు కలిపి తల్లితో తాగించాడు. ఆ తర్వాత తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబీకులు... వెంటనే వీరిద్దరిని కోరుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా...మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు