చరవాణి విషయమై గొడవపడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగుల మందు తాగారు. పరిస్థితి విషమించి తల్లి మృతిచెందగా.. కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గోల్నాక జైస్వాల్‌గార్డెన్‌లో నివాసం ఉండే శ్రీనివాస్, నీరజ(39) దంపతులు. వీరికి కుమార్తె భువనేశ్వరి (18), కుమారుడు దీపక్‌సాయి ఉన్నారు. పని నిమిత్తం శ్రీనివాస్ బుధవారం రాత్రి నాదర్‌గుల్ వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో చరవాణి విషయంలో తల్లీకూతుళ్లు గొడవపడ్డారు.
నీరజ ఆవేశంతో పురుగుల మందు తాగింది. భువనేశ్వరి కూడా తాగటంతో.. ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. 108కు సమాచారం ఇవ్వటంతో ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 6 గంటలకు తల్లి మరణించారు. కుమార్తె చికిత్స పొందుతోంది. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః గ్రామస్థుల వద్ద రూ.10 కోట్లు అప్పు చేసి పరారైన కాంట్రాక్టర్