తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. గ్రామానికి చెందిన మారగోని పుష్పమ్మ తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో బాత్రూంకి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సామాన్లు శోధిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన పుష్పమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కొని వెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కనకంటి యాదగిరి తెలిపారు. ఇద్దరు వృద్ధులు ఇంట్లో ఉండడం గమనించిన దుండగులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: