ETV Bharat / jagte-raho

ట్రాఫిక్ పైలాన్​ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - man tried to committ suicide in Hyderabad

హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. ట్రాఫిక్​ పైలాన్​ ఎక్కి ఉరేసుకోవడానికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు రక్షించారు.

man-tried-to-committ-suicide-at-pinjagutta

author img

By

Published : Jan 4, 2021, 5:09 PM IST

హైదరాబాద్ పంజాగుట్టలో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి హల్​చల్ సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసుల పైలాన్ ఎక్కి తన చొక్కాతో ఉరేసుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు గమనించి కాపాడారు.

జహీరాబాద్ మండలం న్యాల్​కల్​కు చెందిన రవి వృత్తిరీత్యా డ్రైవర్. కొంతకాలంగా మానసికంగా రవి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు అతణ్ని చందానగర్​లోని మెడికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు ఖర్చు ఎక్కువగా అవుతుండటం వల్ల నిమ్స్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యులతు తెలియకుండా ఆస్పత్రిని నుంచి తప్పించుకున్న రవి.. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్ పైలాన్​ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తాడుతో రక్షించేందుకు ప్రయత్నించగా... తాడును మెడకు బిగించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రవిని కాపాడారు. అనంతరం అతణ్ని నిమ్స్​ ఆస్పత్రిలో చేర్పించారు.

ట్రాఫిక్ పైలాన్​ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ఇదీ చూడండి :

పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.