ETV Bharat / jagte-raho

విషాదం: పెద్దలను ఒప్పించలేక ప్రేమజంట బలవన్మరణం - lovers sucide

ప్రేమే తమ జీవితం అనుకున్నారు. కలిసి కలకాలం బతుకుదామంటూ మాటిచ్చుకున్నారు. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. చివరికి ఆ ప్రేమలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

telengana
విషాదం: పెద్దలను ఒప్పించలేక ప్రేమజంట బలవన్మరణం
author img

By

Published : Jul 7, 2020, 8:00 PM IST

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రణీత్... ఓ యువతి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ ఫలించేలోపే యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం నిశ్చయం చేశారు.

పెద్దలను ఎదిరించలేక.. విడిపోయి ఉండలేక.. ఇద్దరూ చావే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు. యువకుడు ఉరేసుకుని మృతి చెందగా... యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.