మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అమెరికాకు తీసుకెళ్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ పాల్‌పై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజిట్ వీసా, స్పాన్సర్షిప్ లెటర్ అందిస్తానని 15 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఇప్పటికే రెండు లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వగా ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి కూడా తీసుకున్నారని రామచంద్రపురానికి చెందిన సత్యవతి అనే మహిళ కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రూ.2 లక్షల చెక్కు తీసుకుని డబ్బులు డ్రా చేసి స్పాన్సర్షిప్ లెటర్ ఇవ్వకపోవడం వల్ల తాను పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. పోలీసులు కేఏ పాల్‌తో పాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఒకే విమానంలో గవర్నర్, కేసీఆర్, జగన్