ETV Bharat / jagte-raho

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు! - madhapur sot police arrested inter state gang

స్వగ్రామాల్లో వారు వ్యాపారస్థులు. అందరికీ ఆదర్శంగా ఉండే పెద్ద మనుషులు! కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం దొంగలు. అదేంటీ అనుకుంటున్నారా... అసలేం జరిగిందంటే...

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు!
author img

By

Published : Oct 11, 2019, 11:24 PM IST

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు!

దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణలోని మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, మధ్యప్రదేశ్​లో ఈ నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు. వారి నుంచి 60తులాల బంగారు, 2కిలోల వెండి ఆభరణాలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ, ఉత్తరాఖండ్​లోని వారి సొంత గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని సీపీ తెలిపారు. సంవత్సరంలో ఓ నెలరోజులు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చోరీలు చేస్తారని పేర్కొన్నారు.

TG_HYD_37_11_INTERSTATE_GANG_ARREST_AB_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలుచోట్లు చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన నలుగురు దొంగలు ముఠాగా ఏర్పడి దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ చోరీ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు మాదాపూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 60తులాల బంగారు, 2కిలోల వెండి, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వారి గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని... ఏటా ఒక నెల ఇతర రాష్ట్రాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గత ఐదేళ్లుగా నిందితులు చోరీలకు పాల్పడుతున్నా... ఎక్కడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతున్నారని.... చోరీ చేయడానికి వచ్చిన సమయంలో ఖరీదైన హోటళ్లో బస చేసి... కారులో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశారని సజ్జనార్ తెలిపారు......BYTE సజ్జనార్, సైబరాబాద్ సీపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.