ETV Bharat / jagte-raho

ఇదో.. నేరకథా చిత్రమ్..!

అతడో లఘుచిత్ర దర్శకుడు.. డబ్బుల కోసం పథకం పన్నాడు.. గతంలో తాను అద్దెకున్న ఇంటి యజమాని అయిన చేపల వ్యాపారిపై దృష్టిపెట్టి అతడిని రప్పించాడు. మద్యం తాగించి హత్య చేయడంతోపాటు ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకున్నాడు. శవాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేయడమే గాక అపహరణ పేరిట నాటకమాడి వ్యాపారి కుటుంబం నుంచి డబ్బులు లాగాలని వ్యూహం పన్నాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడి పట్టుబడ్డాడు.

madder
madder
author img

By

Published : Feb 6, 2020, 11:18 AM IST

అనంతపురం జిల్లా కదిరికి చెందిన రాజునాయక్‌ అలియాస్‌ రిజ్వాన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ గతంలో లఘుచిత్ర దర్శకుడిగా పనిచేశాడు. అతడికి పలువురు యువతులతో సంబంధాలున్నాయి. గతంలో వికాస్‌పురి కాలనీలో చేపల వ్యాపారి పి.రమేష్‌ ఇంట్లో అయిదేళ్లు అద్దెకున్నాడు. అనంతరం మల్కాజిగిరికి మకాం మార్చాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజునాయక్‌ ఆర్థికంగా ఇబ్బందులపాలయ్యాడు. రమేష్‌ గురించి పూర్తిగా తెలియడంతో డబ్బులు గుంజేందుకు పథకం వేశాడు. నెల క్రితం ఓ మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్‌నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గత నెల 26న రమేష్‌కు యువతిని ఎరగా చూపి డబ్బులు లాగాలని ప్రయత్నించినా అతడు స్పందించకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ నెల 1న రమేష్‌కు ఫోన్‌ చేసి మళ్లీ ఇదే మాదిరి ఎర వేసి జవహర్‌నగర్‌లోని గదికి పిలిపించాడు. రమేష్‌కు నిద్రమాత్రలు కలిపిన మద్యం తాగించి ఆభరణాలను తీసుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తలపై సుత్తితో బలంగా కొట్టగా రమేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆభరణాలు తాకట్టు పెట్టి..

రమేష్‌ను హతమార్చిన తర్వాత ఇంటికి తాళం వేసి ఆభరణాలను తీసుకుని మల్కాజిగిరికి రాజునాయక్‌ వెళ్లిపోయాడు. ఈ నెల 2న ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో నగలు కుదువ పెట్టి ఆ డబ్బులతో అప్పటికే తాకట్టులో ఉన్న తన భార్య ఆభరణాలు తీసుకున్నాడు. కొంత డబ్బు తన వద్ద పెట్టుకున్నాడు. ఆ తర్వాత రమేష్‌ను అపహరించానని, వదిలిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలంటూ హతుడి చరవాణి నుంచే కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ సందేశాలు పంపించాడు. మరోవైపు రమేష్‌ కుమారుడు తన తండ్రి అదృశ్యమైనట్లు ఎస్సార్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసి అపహరణ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. రూ. 20 లక్షలు ఇస్తామని డబ్బుల ఫొటోలు వాట్సాప్‌ ద్వారా పంపించగా.. బుధవారం బోరబండ చౌరస్తా వద్ద తీసుకుంటానని రాజునాయక్‌ చెప్పాడు.

మృతదేహాన్ని ముక్కలు చేయాలని..

రమేష్‌ మృతదేహాన్ని మాయం చేయాలని రాజునాయక్‌ ఈ నెల 2న రాత్రి ఓ మహిళతో కలిసి ప్లాస్టిక్‌ సంచితో జవహర్‌నగర్‌లోని గదికి వచ్చాడు. ఆ సంచిలో పట్టకపోవడంతో రమేష్‌ చేతులను కోశారు. కాళ్లను కోసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనంతరం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై మల్కాజిగిరి వెళ్లిపోయారు. 3న రాత్రి మళ్లీ రాజునాయక్‌ వచ్చాడు. మృతదేహం నుంచి వాసన వస్తుండటంతో నాఫ్తలిన్‌ ఉండలు, రూమ్‌ ఫ్రెషనర్‌ను చల్లాడు. గదికి తాళం వేసి ఇంటి యజమానికి అద్దె ఇచ్చేశాడు. మంగళవారం గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో యజమాని తాళం పగులగొట్టి చూసేసరికి మృతదేహం కనిపించగా 100కు సమాచారమిచ్చాడు. ఒకవైపు సంఘటనాస్థలం వద్ద పోలీసులు, రమేష్‌ కుటుంబ సభ్యులు ఉండగానే.. డబ్బులు డిమాండ్‌ చేస్తూ రాజునాయక్‌ వాట్సాప్‌ సందేశాలు పంపించాడు. ఈ హత్య కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఛేదించారు. మల్కాజిగిరిలో రాజునాయక్‌తో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

చేపల వ్యాపారిని ఎంత దారుణంగా చంపాడంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.