ETV Bharat / jagte-raho

విషాదం: నీట మునిగి దంపతులు మృతి - విషాదం: భార్యాభర్తలను బలిగొన్న బావి

ప్రమాదవశాత్తు బావిలో పడిన భార్యను కాపాడబోయిన భర్త కూడా అందులో జారిపడ్డారు. ఫలితంగా నీట మునిగిన ఆ దంపతులు మృతిచెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా కురువపల్లె ప్రాంతంలో జరిగింది.

husband and wife died due to fall in pond at kurava palli chittoor district
విషాదం: నీట మునిగి దంపతులు మృతి
author img

By

Published : Oct 19, 2020, 9:34 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలోని కురువపల్లె ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మదనపల్లి మండలం పీటీయంలో నారాయణ, వెంకట రమణమ్మ దంపతులు నివాసముండేవారు. అయితే వాళ్లకు గ్రామంలో సొంత ఇళ్లు లేకపోవడం వల్ల ధోని బావి అటవీ ప్రాంతంలో వాళ్లకు ఉన్న భూమిలో పాక వేసుకుని ఉంటున్నారు. అక్కడే వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ధోని బావిలో బట్టలు ఉతకటానికి వెళ్లిన వెంకట రమణమ్మ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించేందుకు వెళ్లిన భర్త నారాయణ కూడా మునిగిపోయారు. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎస్సై సహదేవి సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మృతి చెందినట్లు కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహం కాగా కుమారుడు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

మద్యం మత్తులో దంపతుల మధ్య ఘర్షణ... భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.