గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో గత నెలలో చోరీ జరిగింది. దుకాణం తాళాలు పగిలిపోయి ఉండటంపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.
అతనూ స్వర్ణకారుడే..
విచారణలో భాగంగా దుకాణంలోని కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు ఆ రోడ్డు నుంచి వెళ్తున్నట్లుగా గుర్తించి నిందితుడి గురించి ఆరా తీశారు. యువకుడు రేపల్లె నుంచి వచ్చి గత కొన్ని నెలలుగా అదే ప్రాంతంలోని మరో దుకాణంలో స్వర్ణకారుడిగా పని చేస్తున్న శ్రీనాథ్గా గుర్తించారు.
కొద్దిరోజులుగా రావట్లేదు..
అతని గురించి ఆరా తీస్తే గత కొద్దిరోజులుగా దుకాణానికి రావడం లేదని దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో నిందితుడి చరవాణి కూడా దుకాణంలోనే ఉంది. పోలీసులు రేపల్లె వెళ్లి అక్కడ విచారించగా అక్కడకీ రాలేదని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు.
శ్రీనాథే చేసుంటాడు..
శ్రీనాథ్ దొంగతనం చేసి ఉంటాడని భావించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగించారు. శ్రీనాథ్ అతని స్నేహితుడి పేరిట మరో చరవాణి నంబరు తీసుకున్నాడన్న సమాచారాన్ని పోలీసులు సేకరించారు.
సిగ్నల్ ఆధారంగా..
సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా శ్రీనాథ్ హైదరాబాద్లో ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని 71 గ్రాముల బంగారం, 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మీ వివరించారు.