ETV Bharat / jagte-raho

జప్తు చేసిన బంగారు ఆభరణాలు అందజేత - Tadipatri DSP Venkata Shivareddy press meet

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఏడాది జనవరి 28న జప్తు చేసిన 2.648 కిలోల బంగారు ఆభరణాలను సంబంధిత వ్యాపారులకు అందజేశారు. ఈ మేరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు.

gold jewelry headed over to the gold merchants at tadipatri in Anantapur district
జప్తు చేసిన బంగారు ఆభరణాలు అందజేత
author img

By

Published : Oct 14, 2020, 4:58 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెయిన్ బజార్​లో ఈ ఏడాది జనవరి 28న జప్తు చేసిన 2.648 కిలోల బంగారు ఆభరణాలను సంబంధిత వ్యాపారులకు అందజేసినట్లుగా తాడిపత్రి డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. నెల్లూరుకి చెందిన షేక్ షఫీ.. తాడిపత్రిలోని బంగారు దుకాణాదారుల కోరిక మేరకు నెల్లూరు నుంచి ఆభరణాలు తయారు చేయించి సరఫరా చేస్తుంటాడు.

ఇందులో భాగంగా జనవరి 28న దుకాణదారులకు డెలివరీ ఇచ్చేయందుకు 6 కిలోల ఆభరణాలు తీసుకుని తాడిపత్రికి వచ్చారు. బంగారు దుకాణదారుల అసోసియేషన్ భవనంలోని లాకర్​లో 2.684 కేజీల ఆభరణాలు ఉంచి 2.5 కేజీల ఆభరణాలు తీసుకుని దుకాణం వద్దకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి షఫీ వద్ద నుంచి నగలు ఉన్న సంచిని లాక్కుని పరారయ్యారు. షఫీ వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు లాకర్ గదిలో ఉన్న 2.648 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. బంగారు అభారణాలకు సంబంధించిన బిల్లులు కేవలం 2.5 కిలోలకు మాత్రమే ఉండటం వల్ల 2.648 కిలోల ఆభరణాలను జప్తు చేసి అదాయపన్ను శాఖ అధికారులకు అందజేశారు.

విచారణలో తేలింది..

బంగారు ఆభరణాలు దొంగిలించిన ముగ్గరు నిందితులను 10 రోజుల్లోనే అదుపులోకి తీసుకుని వాటిని షఫీకి అందజేశారు. మిగిలిన 2.648 కిలోలకు సంబంధించి ఇన్​కం ట్యాక్స్​ అధికారులు.. షఫీని విచారించగా ఆ ఆభరణాలు తాడిపత్రికి చెందిన ఇద్దరు వ్యాపారులవి గుర్తించారు. వారికి అపరాధ రుసుం విధించి ఆభరణాలు అందజేయాలని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు వ్యాపారులిద్దరిని పిలిపించి ఆభరణాలు అందజేశారు.

ఇదీ చూడండి

భారీగా నాటుసారా పట్టివేత..తొమ్మిది మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.