ETV Bharat / jagte-raho

బోట్లకు ఇంజిన్​లు అమర్చితే కఠిన చర్యలు: ఏఎస్పీ షరీఫ్ - special Branch Police News today

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఇసుక ర్యాంప్​లో స్పెషల్ బ్రాంచ్ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇంజిన్​లు బిగించి గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న ఆరు పడవలను, 190 టన్నుల ఇసుకను సీజ్ చేశారు.

బోట్లకు ఇంజిన్​లు అమర్చితే కఠిన చర్యలే : ఏఎస్పీ షరీఫ్

author img

By

Published : Sep 27, 2020, 5:04 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఇసుక ర్యాంప్​లో స్పెషల్ బ్రాంచ్​ ఏఎస్పీ కరిముల్లా షరీఫ్ నేతృత్వంలో దాడులు చేపట్టారు. నరసాపురం ఇసుక ర్యాంప్​లో పలువురు బోట్ యజమానులు, మైనింగ్, ఇరిగేషన్ యాక్టులకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఏఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో పడవలకు ఇంజిన్​లు అమర్చి గోదావరి నది నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్నారు.

  • ఫిర్యాదులు వచ్చినందుకే..

ఈ అంశంపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే దాడులు నిర్వహించినట్లు ఏఎస్పీ షరీఫ్ వెల్లడించారు. డిజిల్ ఇంజిన్​లను ఉపయోగించి ఇసుకను తరలిస్తున్న ఆరు పడవలను, 190 టన్నుల ఇసుకను సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. సాంప్రదాయ పద్ధతిలోనే గోదావరి నది నుంచి ఇసుకను తరలించాలని సూచించారు. అలా కాకుండా ఇంజిన్​లు ఉపయోగిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ షరీఫ్ హెచ్చరించారు.

ఇవీ చూడండి : 'మమ్మల్ని కాదంటే.. మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.