ETV Bharat / jagte-raho

హాయ్.. లెట్స్ హావ్ సమ్ ఫన్..!? - latest cyber crime in ap news

25 ఏళ్ల కార్తీక్ ఐటీ ఉద్యోగి..! స్మార్ట్​ఫోన్​లో 'ఏదేదో..' సెర్చ్ చేస్తుంటే.. ఓ విషయం ఆకట్టుకుంది. హాయ్.. 'లెట్స్ హావ్ సమ్ ఫన్' అంటూ ఉన్న పలకరింపును చూసి... కార్తీక్ పులకరించిపోయాడు. ఆ తర్వాత 95వేలు సమర్పించుకున్నాడు. కార్తీక్ ఒక్కడే కాదు.. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతోందంటే..!?

cyber-criminals-are-cheating-boys-making-phone-calls-with-girls-in-hyderabad

author img

By

Published : Feb 22, 2020, 2:03 PM IST

Updated : Feb 22, 2020, 3:17 PM IST

ఆన్​లైన్ వేదికగా విసురుతున్న 'వలపువల'కు యువత విలవిల్లాడుతోంది. డేటింగ్ సైట్ల నుంచి సైబర్ నేరగాళ్లు సమ్మోహనాస్త్రాలను విసురుతున్నారు. ఇప్పుడు ఓ కొత్త తరహా.. మోసం వెలుగులోకి వచ్చింది. ‘వలపు ఆశ చూపి... యువతులతో ఫోన్లు చేయిస్తూ సొమ్ము స్వాహా చేస్తున్నారు.

ఆనందం మీదే..!

"‘యువతీ, యువకులు కలుసుకునేందుకు... ఒకట్రెండు రోజులు సరదాగా గడిపేందుకు అనువైన వేదికలను అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్నాం. మాకు వందల సంఖ్యలో వినియోగదారులున్నారు. వీరిలో 80 శాతం మంది యువతులే. వారితో గడిపేందుకు యువకులు.. విద్యార్థులకు అవకాశం. ‘ప్లేబాయ్‌’గా మారి ఆనందించండి... రూ.లక్షల్లో ఆదాయం సంపాదించండి’." ఓ డేటింగ్ వెబ్​సైట్​లో ప్రకటన ఇది..! సుమారు 15 డేటింగ్‌ వెబ్‌సైట్లలో ఇలాంటి ‘'వల'’పు ప్రకటనలు కనిపిస్తున్నాయి. నెలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ ఆదాయం ఉంటుందని ఆశ చూపుతున్నారు. తమకు పది శాతం కమీషన్‌ ఇవ్వాలని... ఫొటోలు, వీడియోలతో పాటు రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు, యువకులు ఈ ప్రకటనలకు ఆకర్షితులై రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. నేరగాళ్ల బారినపడి తమ ఖాతాల నుంచి రూ.వేలు, రూ.లక్షల నగదు బదిలీ చేస్తున్నారు.

మాటలతో మాయ..

వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. సైబర్‌ నేరస్థులు ఫోన్లు చేస్తారు. వ్యక్తిగత వివరాలు, చిరునామాలు తెలుసుకున్న అనంతరం రెండు, మూడు రోజుల్లో తమ వినియోగదారులు నేరుగా ఫోన్‌ చేస్తారని చెబుతారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, శివార్లలోని రిసార్టులకు యువతులు ఆహ్వానిస్తారని, వారు తెలిపిన ప్రాంతం వివరాలు చెబితే కారు పంపుతామని చెబుతారు. ఆ ప్రకారంగానే.. రెండు రోజుల్లోనే బాధితులకు యువతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ‘మీరు మా ఫ్లాట్‌కు రండి... కలిసి భోం చేద్దాం... నాకు మద్యం తాగే అలవాటుంది.. మీకూ ఇష్టమేనా’ అంటూ ఆ యువతులు వల వేస్తారు. మద్యం, మంచి ఆహారం తీసుకురండి అని చెప్తారు. ప్రస్తుతం తమ వద్ద క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లేనందున మీరే తీసుకురావాలంటారు. తీరా యువకులు... తానున్న చోట హోటళ్లు లేవని బదులిస్తే... తన స్నేహితురాలి ఖాతాకు నగదు బదిలీ చేస్తే మీరు వచ్చేసరికి ఆహార పానీయాలు సిద్ధం చేసి ఉంచుతామని మరింతగా నమ్మిస్తున్నారు. యువతి సూచించిన ఖాతాల్లోకి బాధితుడు నగదు బదిలీ చేయగానే.. సైబర్‌ నేరస్థులు, అప్పటి వరకూ మాట్లాడిన యువతి ఫోన్లు స్విచ్చాఫ్‌ చేస్తున్నారు. ఇదే కోవలో చాలా మంది వేలల్లో డబ్బులు వదిలించుకుంటున్నారు.

బయటపడని బాధితులు

మోసపోయామని తెలిసినప్పటికీ.. బయటకు చెబితే పరువు పోతుందనే ఆందోళనతో చాలామంది బాధితులు బయటపడటం లేదు. పోలీసులకు ఫిర్యాదులూ తక్కువగానే వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారంలో ఇప్పటివరకూ రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ వి.ఎం ప్రసాద్ తెలిపారు. ఒక కేసులో దమ్మాయిగూడెం నివాసి దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. అతడు తొమ్మిది మందిని మోసం చేసినట్లు అంగీకరించాడు. ఇలాంటి మోసాలు బెంగళూరు, ముంబయి నగరాల తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్​లైన్ లో అందమైన ప్రకటనలు కనబడగానే ఆకర్షితులు కావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:

సరోగసి పేరుతో సరసమాడాడు..

Last Updated : Feb 22, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.