విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం జన్నేరులో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గ్రామానికి దంపతులు సోమేలి ఉపేంద్ర- చిన్నారి. కొంత కాలంగా కుటుంబ కలహాలతో వీరు గొడవలు పడుతున్నారు. ఈ నెల 12న చిన్నారి ఆకస్మికంగా మృతి చెందింది. ఇవాళ ఉపేంద్ర మృతి చెందాడు.
ఈ దంపతుల మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. ముందుగా ఇద్దరూ పురుగు మందులు సేవించి మృతి చెందినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై జన్నేరులో విచారించగా పలువురు పలు విధాలుగా చెబుతున్నారు. భార్య కుటుంబీకులు కొట్టినట్లు, భార్య మృతితో రెండు రోజులుగా ఏమీ తినకతినకపోవడం వల్ల చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.