హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తీవ్ర జర్వంతో చికిత్స పొందుతూ... బుధవారం మృతి చెందాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా... ఆస్పత్రికి వైద్యులు స్పందించలేదని... అందుకే తన సోదరుడు చనిపోయాడని మృతుని సోదరుడు ఆరోపించారు.
''జ్వరంగా ఉందని ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోలేదు. కరోనా లక్షణాలు లేవని వెనక్కి పంపించేశారు. అనంతరం పోలీసుశాఖ తరఫునుంచి వెళ్లినా... వారు చికిత్స అందించలేదు. ఎట్టకేలకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. సోమవారం నుంచి మాతో కాంటాక్ట్‌లో కూడా లేకుండా పోయాడు. తన పరిస్థితి బాలేదని డిపార్ట్మెంట్ వాళ్లు బుధవారం ఉదయం మాకు తెలిపారు. సాయంత్రానికి చనిపోయినట్లు వెల్లడించారు. వాళ్లే అంత్యక్రియలు నిర్వహించారు.''
- సోదరుడు
ఓ కానిస్టేబుల్ పరిస్థితే ఇలా ఉంటే... సగటు ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. తన సోదరుడుతో కాంటాక్ట్ అయిన వారికి ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయలేదని ఆరోపించారు.
ఇవీ చూడండి: విషాదం.. చిన్నారిని హతమార్చి దంపతుల ఆత్మహత్య