ETV Bharat / jagte-raho

ఆస్తిని పంచి.. అనాథల్లా మిగిలారు.. చివరికి..! - bus stop is home to an old age couple

చెట్టుకు కాయ భారం కాదు. తల్లిదండ్రులకు... పిల్లలు భారం కాదు. కానీ... కొందరు తనయులకు మాత్రం తల్లిదండ్రులు భారంగా మారుతున్నారు. పెంచి పెద్ద చేశారన్న ఆలోచన కూడా లేకుండా ఆస్తులు లాక్కొని రోడ్డుపైకి గెంటేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా​కు చెందిన హుస్సేన్, యూకూబీ దంపతులు ఇలాంటి వారే.

parents
parents
author img

By

Published : Jun 2, 2020, 7:07 PM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వృద్ధ దంపతులు హుస్సేన్, యూకూబీలను కన్న కుమారులు ఇంటి నుంచి గెంటేశారు. తమ ఐదుగురు పిల్లలకు ఆ వృద్ధ దంపతులు తమ ఆస్తిని పంచి ఇచ్చేశారు. చనిపోయిన నాలుగో కుమారుడి ఇంట్లోనే ఉంటూ పింఛను సొమ్ముతో జీవనం సాగించారు.

పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి ఇచ్చారని ఆరోపిస్తూ మిగిలిన వారు.. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని వారిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారికి బస్టాపే నివాసమైంది. రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కుమారులను మందలించగా... తల్లిదండ్రులను ఇంటికి తీసుకువెళ్లారు.

ఇవీ చూడండి:

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.