దిశ నిందితుల ఎన్కౌంటర్లో మొత్తం 12 తూటాలను గుర్తించారు. ఒక్కొ మృతదేహానికి 10 అడుగుల దూరం ఉంది. ఏ1 నిందితుడు ఆరిఫ్ మృతదేహంలో నాలుగు తూటా గాయాలున్నాయి. అతడి ఛాతీకి కుడి ఎడమవైపుల్లో ఒక్కోటి చొప్పున, డొక్క, కడుపులోకి మరో రెండు తూటాలు దూసుకెళ్లాయి.
మరో నిందితుడు జొల్లు శివ కుడివైపు ఛాతీ, మెడ, కడుపుల్లో తూటా గాయాలను గుర్తించారు.
జొల్లు నవీన్ కణత, ఛాతీ నుంచి తూటాలు దూసుకెళ్లాయి. అతడి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి.
చింతకుంట చెన్నకేశవులు ఛాతీ, కడుపు, ఎడమ భుజానికి ఈ గాయాలున్నాయి.
13 ఆయుధాల గుర్తింపు
పోలీసులపై దాడి చేసేందుకు నిందితులు, రెండు తుపాకులతో పాటు కర్రలు, ఇటుకలు, రాళ్లు ఉపయోగించారు.