ETV Bharat / jagte-raho

కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ - bhuma akhila priya latest news

bhuma-akhila-priya-
bhuma-akhila-priya-
author img

By

Published : Jan 6, 2021, 4:47 PM IST

Updated : Jan 6, 2021, 8:43 PM IST

16:44 January 06

ఏ-1గా ఎ.వి.సుబ్బారెడ్డి , ఏ-2గా అఖిలప్రియ

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంలో ఏ-1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2గా మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ-3గా ఆమె భర్త భార్గవరామ్‌ ఉన్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ఉదయం 11 గంటలకు కూకట్​పల్లిలో భూమా అఖిలప్రియను అరెస్టు చేసినట్లు తెలిపారు. కిడ్నాప్‌ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందని వివరించారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. అఖిలప్రియ కుటుంబానికి, ఎ.వి.సుబ్బారెడ్డికి ముందునుంచీ సంబంధాలున్నాయని తెలిపారు. కిడ్నాప్ ఘటనకు ప్రణాళిక, అమలులో వీరి భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.  అపహరణ కేసును 3 గంటల్లోనే ఛేదించామని పేర్కొన్నారు.  

మంగళవారం  రాత్రి బోయిన్‌పల్లి పరిధిలో కిడ్నాప్‌ ఘటన జరిగింది. ఐటీ అధికారుల పేరుతో ప్రవీణ్‌ ఇంటికి దుండగులు వచ్చారు.  ముగ్గురు సోదరులు ప్రవీణ్‌, సునీల్‌, నవీన్‌ను అపహరించారు. వాహనంలో ముగ్గురిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలను ఒక గదిలో బంధించారు. రాత్రి 8.10 గం.కు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు.  ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తేలింది-   అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

కోర్టులో హాజరుపరిచిన పోలీసులు...

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సికింద్రాబాద్‌ జడ్జి ఎదుట హాజరుపర్చారు. 

కళ్లు తిరిగి పడిపోయిన అఖిలప్రియ...

అంతకుముందు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కిడ్నాప్‌ కేసులో భాగంగా బోయిన్‌పల్లి పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి అఖిలప్రియను తీసుకెళ్లారు. ఈ క్రమంలో కళ్లు తిరగడంతో ఒక్కసారిగా ఆమె పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది సెలైన్‌ ఎక్కించారు. 

అసలేం జరిగింది...

బోయిన్‌పల్లిలో మంగళవారం  రాత్రి బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించింది. ఈ ముగ్గురి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు.

ఇదీ చదవండి

మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్.. పరారీలో ఆమె భర్త

Last Updated : Jan 6, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.