ETV Bharat / jagte-raho

మంత్రి పేర్ని నానిపై దాడి కేసు.. నిందితుడికి తెదేపాతో సంబంధంపై ఆరా

మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో జరిగిన దాడి కేసులో నిందితుడైన నాగేశ్వరరావుకు తెదేపాతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడి సోదరితో పాటు, మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు విచారించారు. నిందితుడికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు తరచూ వచ్చే వచ్చేవాడా అన్న కోణంలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు బంధువులను కూడా పోలీసులు మళ్లీ విచారించనున్నారు. నిందితుడ్ని పోలీసు కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్​పై కోరుతూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

Attack on minister perni
Attack on minister perni
author img

By

Published : Dec 2, 2020, 2:22 PM IST

నిందితుడికి తెదేపాతో సంబంధంపై పోలీసుల ఆరా

మంత్రి పేర్ని వెంకట్రామయ్యపై జరిగిన దాడి కేసులో నిందితుడు నాగేశ్వరరావుకు తెదేపాతో ఉన్న సంబంధాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడ్ని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడి సోదరితో పాటు.. మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు విచారణ చేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కావడంతో నగరంలో చర్చనీయాంశమైంది. తెదేపా సీనియర్‌ నాయకులైన మరకాని పరబ్రహ్మం, మాదిరెడ్డి శ్రీను, చిన్నం శివలతో పాటు, నాగేశ్వరరావు సోదరి బడుగు ఉమాదేవిని పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు.

నిందితుడు నాగేశ్వరరావు మీకు పరిచయస్తుడేనా? మీకు అతనితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు తరచూ వస్తుంటాడా? తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటాడా? వంటి అంశాలపై ప్రశ్నలు అడిగిన పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు రావాలని నాగేశ్వరరావు బంధువులను కోరినట్లు చెప్పారు. అలాగే మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అర్జీలు ఇచ్చేవారితో పాటు.. ఇంటికి వచ్చే కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావును విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి కోరుతూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్​పై విచారణ జరిగే అవకాశం ఉంది. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మంత్రిపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడా? ఎవరైనా వెనుక ఉండి ప్రేరేపించారా? లేదా అనుకోకుండా జరిగిందా? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.