తెలంగాణలోని... హైదరాబాద్ బల్కంపేటలోని ఓ పెట్రోల్ బంక్ సిబ్బందిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్ధరాత్రి డీజిల్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా గొడవకు దిగారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందిని దుర్భాషలాడారు. వారి స్నేహితులకు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. ఆరుగురు వ్యక్తులు సిబ్బందిపై దాడి చేస్తుండగా... అడ్డొచ్చిన మేనేజర్నూ గాయపరిచారు. సిబ్బంది చేతిలో ఉన్న క్యాష్ బ్యాగును లాక్కోడానికి ప్రయత్నించారు. చుట్టూ ఉన్న వ్యక్తులు గొడవ దగ్గరికి చేరుకోవటం వల్ల దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో బంక్ మేనేజర్ స్వామిగౌడ్, సిబ్బంది నరేష్‌కు తీవ్ర గాయాలు కావంటం వల్ల ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ డీలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎస్సానగర్లోని బాపునగర్కి చెందినవాళ్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: