కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రాయచోటి వైపు నుంచి వస్తున్న ఇంధన లారీ గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టగా.. రోడ్డుపై పడింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ట్రాఫిక్కు మాత్రం తీవ్ర అంతరాయం కలిగింది.
2 వైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 9 గంటలు... పైగా అటవీ ప్రాంతం కావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...రాకపోకలు పునరుద్దరించారు.
ఇదీ చదవండి: