ETV Bharat / jagte-raho

నీటి కుంటలో పడి యువకుడు మృతి - గుంటూరు జిల్లా క్రైం న్యూస్​

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలనుకున్న ఆ యువకుడిని మృత్యువు నీటి కుంట రూపంలో కబళించింది. కుంటలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జరిగింది.

a young boy died due to fell into pond at tallapalli guntur district
నీటి కుంటలో పడి యువకుడు మృతి
author img

By

Published : Oct 12, 2020, 9:20 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన చిన వెంకటేశ్వర్లు, గురవమ్మ దంపతుల కుమారుడు కొండా నజీర్ బాబు(19). కుటుంబంలో ఆర్థిక విషయాల్లో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ చదివిన నజీర్ బాబు... కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు చేదోడుగా నిలవాలనుకున్నాడు. అందులో భాగంగా కొత్తపల్లి గ్రామంలోని ఓ నర్సరీలో కొద్దిరోజులు క్రితం పనిలో చేరాడు.

పనికని వెళ్లి.. శవమై తేలాడు

ఇవాళ వర్షం పడటం వల్ల నర్సరీలో అతని కాళ్లకు బురద అంటింది. దాన్ని కడుక్కునేందుకు నర్సరీ కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలోకి దిగగా... ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడని ప్రత్యక్ష సాక్షి కొండా శ్రీనివాస్ తెలిపారు. నజీర్​ను కాపాడేందుకు ప్రయత్నించినా.... ఆ కుంట లోతుగా ఉండటం వల్ల నీటిలో మునిగిపోయాడని వివరించారు. గ్రామస్థులు గాలింపు చేపట్టగా చివరకు శవమై తేలాడు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు అర్థంతరంగా చనిపోవడం వల్ల ఆ కుటంబసభ్యుల రోదన మిన్నంటింది. ఘటనా స్థలానికి చేరుకున్న విజయ పురి సౌత్ ఎస్సై పాల్ రవీందర్.. ప్రమాదంపై విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

మార్కెట్ వద్ద ఉద్రిక్తత...వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.