తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళను పెళ్లి చేసుకుని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. జిల్లాలోని పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన రంగనాథం శ్రీనివాస్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు సోమవారం కాకినాడ దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చదువుకునే రోజుల్లో ప్రేమిస్తున్నానంటూ శ్రీనివాస్ వెంటపడేవాడు.పెద్దలకు చెప్పడం వల్ల నాకు వేరే వ్యక్తితో వివాహం చేశారు. అయితే ప్రమాదవశాత్తు నా భర్త మరణించాడు. ఒంటరిగా ఉంటున్న క్రమంలో నాకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. షిరిడీ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం నా నగలు, భర్త చనిపోగా వచ్చిన రూ. 15 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు కావాలని అడిగినప్పుడు పొంతనలేని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నాడు. -బాధితురాలు
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గ్రామంలో పలువురు వద్ద డబ్బులు వసూలు చేశాడని.. అతేకాక పలువురి మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకున్న మహిళ.. శ్రీనివాస్‌ను నిలదీసింది. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఈ విషయంపై పోలీసులను ఫిర్యాదు చేశామని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని 'ఈటీవీ భారత్'ను ఆశ్రయించింది.
ఇదీ చదవండి: