అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో మృతున్ని గుర్తుతెలియని మరో వ్యక్తి బండరాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మంచాలకు రిపేర్లు చేస్తూ జీవించేవాడని భావిస్తున్నారు. మృతుని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ వాహనాన్ని నిందితుడు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుక్కరాయసముద్రం సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. క్లూస్ టీం, సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్నామని త్వరలో నిందితున్ని పట్టుకుంటామన్నారు.
ఈ చెరువు సమీపంలో గతంలోనూ ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.