ETV Bharat / jagte-raho

తెలంగాణ : భూ తగాదాలతో గొడ్డలితో నరికి చంపారు!

భూ వివాదం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మెట్​పల్లిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి రాసమల్ల సంపత్, బోనగిరి ఓదేలుకు భూ వివాదం తలెత్తింది. శుక్రవారం సంపత్ పొలంలో పనిచేస్తుండగా ఓదేలు గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో ఓదేలు కుమారుడు జంపయ్య గొడ్డలితో సంపత్​పై దాడి చేశాడు. దీంతో సంపత్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

MURDER
MURDER
author img

By

Published : Dec 11, 2020, 7:24 AM IST

భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌ రావులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రాసమల్ల సంపత్‌, అదే గ్రామానికి చెందిన బోనగిరి ఓదేలుకు మధ్యలో భూ వివాదం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయన్నారు. అధికారులతో భూ సర్వేను కూడా నిర్వహించారని డీసీపీ పేర్కొన్నారు. శుక్రవారం కూడా పంచాయితీ పెట్టుకునేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సంపత్ పొలంలో పని చేసుకుంటుండగా, ఓదేలు ఘర్షణకు దిగినట్లు ఆయన చెప్పారు.

ఓదేలు కుమారుడు జంపయ్య గొడ్డలితో దాడి చేయగా సంపత్‌ అక్కడిక్కడే మృతి చెందాడని డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐలు కిరణ్‌, రాములు, సృజన్‌రెడ్డి, ఎస్సైలు ప్రశాంత్‌రావు, కిరణ్‌రెడ్డి, సతీష్‌, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబీకులు, గ్రామస్థులతో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు పోలీసులను వేడుకొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: టోల్​ప్లాజా వద్ద 500 కిలోల వెండి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.