విజయవాడలో జరిగిన మరో గ్యాంగ్‌వార్ గురించి నార్త్ జోన్ ఏసీపీ షర్ఫుద్ధీన్ వివరించారు. కేదారేశ్వరరావు పేటకు చెందిన షేక్ మున్నాకు, అయోధ్యనగర్ కు చెందిన రాహుల్‌కు మధ్య మద్యం తాగేటప్పుడు వాగ్వాదం జరిగింది. రాహుల్‌పై కోపంతో మున్నా బ్యాచ్‌కి చెందిన వారు దాడి చేశారని.. ఏసీపీ తెలిపారు. మున్నా బ్యాచ్‌లో ఏడుగురిని, రాహుల్ బ్యాచ్‌లో నలుగురిని అరెస్టు చేశామని.. ప్రధాన ముద్దాయి రాహుల్‌తో సహా ఇంకొకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దాడికి వాడిన కత్తులు, కర్రలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ రెండు బ్యాచ్‌లకు చెందిన వారు గంజాయి, మద్యానికి బానిసైనవారేనని..వారిపై నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు