పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థిని బెదిరించారన్న ఫిర్యాదు మేరకు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్పై కేసు నమోదైంది.'పురానాపూల్ డివిజన్ పరిధిలోని ఖుర్షీద్ ఝా కళాశాలలోని రెండు పోలింగ్ బూత్‌లలో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్ చేస్తోందంటూ అస్లాముల్లా షరీఫ్‌కు అక్కడకు వెళ్లారు. అక్కడున్న పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తుండగా.. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తన అనుచరులతో వచ్చారు. అస్లాముల్లాపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహానగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఘర్షణలు, గొడవలపై పోలీసులు వెంటనే స్పందించారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎన్నికల అధికారులు, తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ వేర్వేరు రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిన్నింటినీ పరిశీలించిన పోలీసులు మంగళ, బుధవారాల్లో 11 కేసులు నమోదు చేశారు.
ఇందులో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ సహా నాయకులు, కార్యకర్తలపై ఆరు కేసులు, భాజపా నగర ఉపాధ్యక్షుడు ఉమా మహేందర్, గోల్కొండ, ముషీరాబాద్ డివిజన్ల భాజపా అభ్యర్థులు చక్ర మహేష్, ప్రకాష్ గౌడ్లపై కేసులు నమోదయ్యాయి. ఓయూ సిటీ రాణాలో తెరాస కార్యకర్త అస్లాంపై కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ సోదరుడు రషీద్ ఖాన్‌పై మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం సహా అద్దాలు ధ్వంసం చేశారనే ఫిర్యాదుపై హుమయూన్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: