israel palestine clash news: నాబ్లస్ నగరంలో చెలరేగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్ బలగాలు ఒక పాలస్తీనా వ్యక్తిని కాల్చి చంపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. హత్యకు గురైన వ్యక్తిని జమీల్ కయ్యల్ (31)గా గుర్తించింది. ఓ పాలస్తీనియన్‌ను అరెస్టు చేయడానికి ఆర్మీ సైనికుల సహాయంతో తమ పారామిలిటరీ బోర్డర్ పోలీసులు నాబ్లస్‌లోకి ప్రవేశించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. పాలస్తీనియన్ల బృందం ఇజ్రాయెల్ దళాలపై పేలుడు పదార్థాలను విసిరినప్పుడు ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత కయ్యల్ రక్తస్రావంతో నేలపై పడి ఉన్న వీడియోలు బయటికి వచ్చాయి.
israel palestine conflict: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం తరచుగా నిర్బంధ దాడులను నిర్వహిస్తుంది. పాలస్తీనియన్ అథారిటీ నియంత్రణలో ఉన్న భూభాగాల్లో, అంతర్జాతీయంగా స్వయంప్రతిపత్తిని కలిగిన ప్రదేశాల్లో పాలస్తీనియన్ మిలిటెంట్ల కోసం తనిఖీలు చేస్తుంది.
1967లో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ భూభాగాల కోసం పాలస్తీనియన్లు పోరాడుతున్నారు. ఈ విషయంలో దశాబ్దం క్రితం ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు ఆగిపోయాయి.China US news: ప్రజాస్వామ్య సదస్సు.. అమెరికాపై చైనా తీవ్ర వ్యాఖ్యలు!
ఇదీ చదవండి:Taiwan China: చైనా బలప్రయోగం.. తైవాన్పైకి 13 యుద్ధవిమానాలు
China US news: ప్రజాస్వామ్య సదస్సు.. అమెరికాపై చైనా తీవ్ర వ్యాఖ్యలు!