WHO Covid report: 'కరోనా మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది.
WHO Covid warning: 'ఈ మహమ్మారి మార్పు చెందుతోంది. కానీ ముగిసిపోలేదు. కొత్త కేసులు రిపోర్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడం వల్ల వైరస్‌ను ట్రాక్ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉంది. దాంతో ఒమిక్రాన్‌ను గుర్తించడం, భవిష్యత్తు వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోంది. బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి' అని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.
'అన్ని దేశాలూ తమ జనాభాలో 70 శాతం మందికి టీకా వేయాలని మేం సూచించాం. 18 నెలల్లో 12 బిలియన్ల టీకాలు పంపిణీ అయ్యాయి. కానీ అల్పాదాయ దేశాల్లో మాత్రం ఇంకా అర్హులకు టీకాలు అందడం లేదు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. పేద దేశాల్లో దీన్ని సాధించడం కష్టమని కొందరు అంటున్నారు. ఈ సమయంలో వైరస్ నిరంతర వ్యాప్తి గురించి ఆందోళనగా ఉంది. దానివల్ల పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది' అని అప్రమ్తతం చేశారు.
మరోవైపు భారత్‌లో ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త ఆందోళనకు గురిచేసినా.. ప్రమాదకరంగా మాత్రం మారలేదు. తర్వాత ఆ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. తాజాగా 19 వేలకు చేరువగా కొత్త కేసులు వచ్చాయి. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలవైపు మొగ్గుచూపుతున్నాయి.
ఇదీ చదవండి: