ETV Bharat / international

‘పాత్రికేయుల్ని జైలుపాలు చేయొద్దు’... జుబైర్ అరెస్టుపై స్పందించిన ఐరాస - ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌

UN on Zubair Arrest: ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. జుబైర్​ అరెస్టుపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని.. వారు వ్యక్తపరిచిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు.

UN Responds Zubair arrest
UN Responds Zubair arrest
author img

By

Published : Jun 30, 2022, 3:02 AM IST

UN on Zubair Arrest: ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని ఐక్యరాజ్య సమితి(UN) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. వారు వ్యక్తపరిచిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు.

‘ఈ ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా ప్రజలు తమ భావాలను వ్యక్తపరిచేందుకు తగిన వాతావరణం ఉండాలన్నది నా అభిప్రాయం. వారి రాతలు, ట్వీట్లు, మాటలపై పాత్రికేయుల్ని జైల్లో పెట్టకూడదు. వారికి బెదిరింపులు లేని వాతావరణం ఉండాలి. ఈ మాట ఈ గదితో సహా ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది’ అని గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ అన్నారు.

జుబైర్

జుబైర్ అరెస్టును లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌(సీపీఏ) తీవ్రంగా ఖండించింది. ‘ఈ అరెస్టు.. భారత్‌ పత్రికా స్వేచ్ఛ కనిష్ఠ స్థాయిని సూచిస్తోంది. మతపరమైన సమస్యలపై రిపోర్టింగ్‌ చేసే సభ్యులకు ప్రభుత్వం సురక్షితంగా లేని, ప్రతికూల వాతావారణాన్ని సృష్టించింది’ అంటూ విమర్శించింది. జుబైర్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై ఆయన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విటర్‌ వినియోగదారుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.