ETV Bharat / international

లంక అధ్యక్ష సచివాలయం పునఃప్రారంభం.. 107 రోజుల తర్వాత! - srilanka president secretariat restarts after 107 days

Srilanka: 107 రోజుల తర్వాత శ్రీలంక అధ్యక్ష సచివాలయం.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం పునఃప్రారంభమైంది. మరోవైపు ఈ నెల 13న శ్రీలంక పార్లమెంటరీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించే క్రమంలో ఒక సైనికుడి నుంచి ఆందోళనకారులు లాక్కొన్న రైఫిల్‌ను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

srilankasrilanka
srilankasrilanka
author img

By

Published : Jul 26, 2022, 5:36 AM IST

Srilanka News: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు వేదికైన శ్రీలంక అధ్యక్ష సచివాలయం.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం పునఃప్రారంభమైంది. 107 రోజుల కిందట ఈ భవనంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. జులై 9న ఆందోళనకారులు ఈ భవనంలోకి చొచ్చుకెళ్లి, దాన్ని తమ ఆక్రమణలో ఉంచుకున్నారు. కొత్త అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ఆదేశాల మేరకు గత శుక్రవారం భద్రతా దళాలు దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో సోమవారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అధ్యక్ష సచివాలయం ఎదుట ఉన్న గాలె రోడ్డుపై ట్రాఫిక్‌ను భద్రతా దళాలు ఇప్పటికే అనుమతించాయి. ఆందోళనల కారణంగా ఈ భవనం బాగా దెబ్బతింది. దీనికి మరమ్మతులు అవసరం. ఈ ప్రాంగణాన్ని ఆక్రమించడం, దానికి నష్టం కలిగించడం, విలువైన వస్తువులను తస్కరించడంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ నెల 13న శ్రీలంక పార్లమెంటరీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించే క్రమంలో ఒక సైనికుడి నుంచి ఆందోళనకారులు లాక్కొన్న రైఫిల్‌ను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చోరుల అరెస్టు
ఆందోళనల సమయంలో అధ్యక్షుడి నివాసం నుంచి తస్కరించిన విలువైన వస్తువులను విక్రయిస్తున్న ముగ్గురిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. బంగారం పూతపూసిన 40 ఇత్తడి సాకెట్లను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కిటికీ కర్టెన్లను వేలాడదీయడానికి వీటిని గోడలపై ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 9న ఆందోళనకారులు నాటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, అప్పటి ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమసింఘెల అధికార నివాసాలను ఆక్రమించారు. విక్రమసింఘె ప్రైవేటు నివాసాన్ని తగులబెట్టారు. ఈ భవనాల్లో కనీసం వెయ్యి వస్తువులు తస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు. వాటిలో అరుదైన కళాఖండాలూ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చైనాపై నిప్పులు చెరిగిన రిషి.. కొత్త సైనిక కూటమితో కళ్లెం వేస్తానంటూ..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.