నిరసనలపై శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పందించారు. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు నియంతృత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతల్ని తిరిగి అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సైన్యం, పోలీసుల్ని ఆదేశించారు.
రణరంగంలా కొలంబో- అధ్యక్షుడి కీలక ఆదేశాలు
15:56 July 13
ప్రధాని కీలక ఆదేశాలు
15:13 July 13
శ్రీలంకలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబోలోని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
14:22 July 13
ఛానల్ ప్రసారాలు బంద్
శ్రీలంకలో నిరసనకారుల ఆందోళనలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ రూపవాహిని తన ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. కొలొంబోలోని ఛానల్ కార్యాలయాన్ని ఆందోళకారులు చుట్టుముట్టడం వల్లే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
11:52 July 13
శ్రీలంకలో భగ్గుమన్న నిరసనలు.. మరోసారి ఎమర్జెన్సీ.. జాతీయ ఛానెల్ ప్రసారాలు బంద్!
శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూను విధిస్తున్నట్లు పేర్కొంది. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన నేపథ్యంలో లంకలో నిరసనలు చెలరేగగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను జారీ చేశారు.
మరోవైపు ప్రధాని రనిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. అధ్యక్షుడు రాజపక్స పరారైన నేపథ్యంలో విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఇటీవల ప్రకటించారు. ఆంగ్ల పత్రిక బీబీసీతో మాట్లాడుతూ గొటబాయ రాజపక్స అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపింది. సజిత్ మాట్లాడుతూ .. "ఒక వేళ ఖాళీ ఏర్పడితే నేను నామినేషన్ వేసేందుకు సిద్ధం. ఇప్పటికే ఈ అంశంపై పార్టీలో, మిత్రపక్షాలతో చర్చించాం. మేము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కం. శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తాం" అని వెల్లడించారు.
ఇదీ చూడండి : తీవ్ర ఇంధన కొరత.. ఇక సైకిళ్లే దిక్కు.. కి.మీ. పొడవునా జనం బారులు