ETV Bharat / international

ప్రధాని, రక్షణ మంత్రి సెల్​ఫోన్స్ హ్యాక్- ఆ దేశంలో కలకలం - స్పెయిన్​ రక్షణ మంత్రి

Spain Spyware: స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్​, రక్షణ మంత్రి సెల్‌ఫోన్‌లపై స్పైవేర్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. గత ఏడాది మేలో పెగసస్​ స్పైవేర్​ ద్వారా హ్యాక్​ చేసినట్లు చెప్పారు.

spain Spyware
స్పెయిన్​లో స్పైవేర్ కలకలం
author img

By

Published : May 2, 2022, 1:48 PM IST

Updated : May 2, 2022, 2:26 PM IST

Spain Spyware: స్పెయిన్​లో స్పైవేర్​ కలకలం సృష్టించింది. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉండే పెగసస్​ స్పైవేర్​ ద్వారా దేశ ప్రధానమంత్రి, రక్షణ మంత్రుల ఫోన్లు గత ఏడాది హ్యాక్​ అయినట్లు స్పెయిన్​ అధికారులు సోమవారం వెల్లడించారు. 'ప్రధాని మంత్రి పెడ్రో శాంచెజ్​ మొబైల్​ ఫోన్​ 2021, మేలో రెండుసార్లు హ్యాకింగ్​కు గురైంది. రక్షణ మంత్రి మార్గరిట్​ రొబెల్స్​ ఫోన్​ను జూన్​లో టార్గెట్​ చేశారు' అని ప్రెసిడెన్సీ మినిస్టర్​ ఫ్లెక్సీ బోలా ఓస్​ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

" హ్యాకింగ్​ ద్వారా చాలా విషయాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నివేదికలను విచారణ నిమిత్తం జాతీయ కోర్టుకు అందించాం. ఇది చట్టవిరుద్ధమైన, అనధికారికంగా చేసిన చర్య అనేదాంట్లో సందేహం లేదు. ఇది విదేశాల నుంచి జరిగినట్లు తెలుస్తోంది. దానికి చట్టబద్ధత లేదు."

- ఫ్లెక్సీ బోలా ఓస్​, స్పెయిన్​ మంత్రి.

2017 నుంచి 2020 మధ్య ఉత్తర కాటలోనియాలో పదుల సంఖ్యలో ప్రజల ఫోన్లు పెగసస్​ బారిన పడినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం తెలిపింది. ఆ విషయంపై వివరాలు వెల్లడించేందుకు స్పెయిన్​ ప్రభుత్వం ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: అమెరికా నిఘా సంస్థ తొలి సీటీఓగా భారత సంతతి వ్యక్తి

Last Updated : May 2, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.