అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. కొలరాడోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. కొలరాడో స్ప్రింగ్స్ శివారులోని క్లబ్ క్యూలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ లెఫ్టినెంట్ పమేలా కాస్ట్రో వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఘటనాస్థలాన్ని చుట్టుముట్టారని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా రాత్రి 11:57 నుంచి 911 కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.
ఈ నైట్‌క్లబ్‌ను ప్రత్యేకంగా స్వలింగ సంపర్కుల కోసం నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. తాజా ఘటనపై సామాజిక మాధ్యమాల వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వలింగ సంపర్కులు ఇది తమ సమాజంపై జరిగిన ద్వేషపూరిత దాడిగా అభివర్ణించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటన వెనుక కారణాలు, ఆయుధ వివరాల వంటి సమాచారం వెల్లడించలేదు. గతంలోనూ ఓర్లాండోలోని ఓ స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అక్కడే హతమార్చారు