ETV Bharat / international

కాంగో రాజధానిపై వరద ప్రకోపం.. 100 మందికి పైగా మృతి - Congo Floods news

Congo Floods 2022 : కాంగో రాజధాని కిన్‌షాసాలో వరద బీభత్సం సృష్టించింది. ఈ విపత్తులో 100 మందికి పైగా మరణించారని పదుల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.

congo floods 2022
congo floods 2022
author img

By

Published : Dec 14, 2022, 7:58 AM IST

Updated : Dec 14, 2022, 12:34 PM IST

Congo Floods 2022 : కాంగో రాజధాని కిన్‌షాసాను భీకర వరద ముంచెత్తింది. ఈ విపత్తులో 100 మందికి పైగా మరణించారని పదుల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం, మట్టి పెళ్లలు విరిగిపడటం వంటి విపత్తులతో కోటి మందికి పైగా జనాభా ఉన్న కిన్‌షాసా చిగురుటాకులా వణికింది.

ప్రస్తుతానికి ఆస్తి నష్టం గురించి కాకుండా ప్రజల భద్రత కోసమే ఆలోచిస్తున్నామని ప్రధాని జీన్‌ మైకేల్‌ సామా ల్యుకొండె వెల్లడించారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నవారే వరద ప్రకోపానికి గురయ్యారని స్థానిక మేయర్‌ ఒకరు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Last Updated : Dec 14, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.