థాయిలాండ్ సరిహద్దు కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్రాండ్ డైమండ్ సిటీలో ఉన్న క్యాసినో హోటల్లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. 60 మంది గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన క్షతగాత్రులను థాయ్‌లాండ్‌లోని సాకేయో ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. "తొలుత మంటలు హోటల్ ఒకటో అంతస్తులో సంభవించాయి. తర్వాత ఈ మంటలు కార్పెట్లకు అంటుకుని భవనం అంతటా వ్యాప్తిచెందాయి" అని స్థానికులు తెలిపారు.