ETV Bharat / international

చైనా దారిలోనే రష్యా... అంతరిక్ష కేంద్రానికి గుడ్​బై! - రష్యా ఐఎస్​ఎస్​ న్యూస్

Russia quit ISS: రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 సంవత్సరం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది. సొంతంగా ఆర్బిటింగ్​​ అవుట్​ పోస్టును నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ అధిపతి యూరి బోరిసోవ్ వెల్లడించారు.

Russia quit iss
Russia quit iss
author img

By

Published : Jul 26, 2022, 10:55 PM IST

Russia Goodbye ISS: 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగనున్నట్లు రష్యా ప్రకటించింది. సొంత ఆర్బిటింగ్‌ అవుట్‌పోస్టును నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష కార్పొరేషన్‌ రోస్కోస్మోస్‌ కొత్త చీఫ్‌ యూరి బోరిసోవ్‌ వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టు నుంచి వైదొలిగే ముందు రష్యా తన బాధ్యతలను నెరవేర్చే వెళ్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ రష్యా తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనీసం ఒక రష్యా వ్యోమగామి, ఒక అమెరికా వ్యోమగామి ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు, కెనడా భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఇప్పటివరకు అంతరిక్ష కేంద్రం కార్యకలాపాలపై పడలేదు. సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని చైనా దాదాపుగా పూర్తి చేసిన వేళ రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: శ్రీలంకకు తిరిగిరానున్న గొటబాయ.. మోదీ కీలక సందేశం!

లంక అధ్యక్ష సచివాలయం పునఃప్రారంభం.. 107 రోజుల తర్వాత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.