ETV Bharat / international

నలుగురు ఉన్న కుటుంబానికి ఆరు ఇళ్లు.. ఆ గ్రామమంతా వారిదే - అమెరికా నలుగురి గ్రామం

ఉరుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా.. చక్కని వాతావరణంలో.. ఓ గ్రామాన్నే ఇంటిగా మార్చుకొని కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా. అచ్చం అలాంటి జీవితాన్నే గడుపుతోంది అమెరికాలోని ఒక కుటుంబం. వినడానికి, చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉన్న ఈ కుటుంబం గురించి వివరాలు మీకోసం..

private tiny house village
private tiny house village
author img

By

Published : Mar 1, 2023, 2:56 PM IST

అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లండన్ పట్టణంలో ఓ గ్రామాన్నే తమ నివాసం చేసుకుందీ కుటుంబం. సుస్థిరమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో.. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంది. కుటుంబంలో ఉండేది నలుగురే అయినా.. ఎవరి ఇల్లు వారిదే. తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు ఒక్కోటి, అందరు కలిసి ఉండేందుకు మరోటి.. ఇలా చిన్న చిన్న ఇళ్లతో ఏకంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంది. సుస్థిరమైన జీవన విధానాన్ని అందరికీ తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా ఇలా జీవిస్తున్నారు.

2015లోనే భూమి కొని..
కెలి, రియాన్ బ్రింకెన్ కుటుంబం తమ ఇద్దరు టీనేజ్​ పిల్లలతో కలిసి ఈ గ్రామంలో నివసిస్తున్నారు. కెంటకీలోని లండన్​లో 2015లోనే బ్రింకెన్ కుటుంబం 21ఎకరాల భూమిని.. 57వేల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ భూమిలో 6 చిన్న ఇళ్లను ఏర్పాటు చేసుకుంది.

private-tiny-house-village
బ్రింకెన్ కుటుంబం నిర్మించుకున్న ఇళ్లు (ఇమేజ్ క్రెడిట్: లెనాక్స్ బ్రింక్స్)

"భూమిని కొనడానికి కెంటకీలోని లండన్​ను ఎంపిక చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ భూమి విలువ చాలా తక్కువ. ఇళ్లు నిర్మించుకునే విషయంలో ఆంక్షలు కూడా తక్కువగా ఉంటాయి. టెన్నెసీ ప్రాంతంలో కంటే చాలా తక్కువ ధరలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం" అని కేలి చెప్పారు.

కేలి, రియాన్ నివసిస్తున్న 280 చదరపు అడుగుల ఇల్లు విలువ 9వేల డాలర్లు. అన్ని రకాల సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించారు. "వెంటిలేషన్ కోసం ఎక్కువ కిటికీలు, ఎగ్జిట్ డోర్ కోసం వెనుక భాగంలో అదనపు కటౌట్ ప్రాంతం, ఇంట్లోకి వెలుగు ఎక్కువ రావడం కోసం కొన్ని మార్పులు చేయించాం" అని కేలి చెప్పారు. వీరి కూతురు లెనాక్స్, కుమారుడు బ్రాడీ 160 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న చిన్న ఇళ్లలో నివసిస్తున్నారు. కుటుంబం అంతా కలిసి ఉండేందుకు మరో చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. వీరి పిల్లల ఇళ్లలో టాయిలెట్స్ లేవు. అందుకని వారికోసం ప్రత్యేకంగా టాయిలెట్స్​ను ఏర్పాటు చేశారు. అది కూడా చిన్నపాటి ఇల్లులా ఉంటుంది.

private-tiny-house-village
బ్రింకెన్ కుటుంబం ఇళ్లు (ఇమేజ్ క్రెడిట్: లెనాక్స్ బ్రింక్స్)

ఐదేళ్ల క్రితం బ్రింక్స్ కుటుంబం సుస్థిరమైన జీవనాన్ని గడపాలని మిషిగన్​లోని తమ 2,200 చదరపు అడుగుల ఇంటిలోకి మారాలనుకున్నారు. అయితే, చిన్న ఇల్లు అయితేనే బాగుంటుందని తర్వాత మనసు మార్చుకున్నారు. 'చిన్న ఇళ్లలో చాలా తక్కువ చెత్త ఉంటుంది. తక్కువ హీట్ అవసరమవుతుంది. అలాగే పర్యావరణానికి చాలా మేలు కలుగుతుంది' అని ఆ కుటుంబం చెబుతోంది. 'మొదటగా నా భర్త.. అందరం ఒకే ఇంట్లో కలిసుందాం అని అన్నారు. కానీ వ్యక్తిగత గోప్యత అనేది అవసరం అని నేను అన్నాను. అందుకే ప్రత్యేకంగా ఎవరి ఇల్లు వారికి ఉండేలా చిన్న ఇళ్లను కొన్నాం' అని కేలి చెబుతున్నారు.

కుటుంబానికి ఒకటి..
కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడపటానకి ఒక పూల్ హౌస్​ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది 180 చదరపు అడుగులు ఉంటుంది. 'కుటుంబం అంతా వేర్వేరు ఇళ్లలో నివసించడం వింతగా ఉండొచ్చు. కానీ వ్యక్తిగత గోప్యత పరంగా ఇది బాగుంటుంద'ని లెనాక్స్ చెబుతున్నాడు.

private-tiny-house-village
బ్రింకెన్ కుటుంబం (ఇమేజ్ క్రెడిట్: లెనాక్స్ బ్రింక్స్)

బ్రాడీ ఇల్లు
16ఏళ్ల బ్రాడీ ఇల్లు పూల్​ హౌస్​కు సమీపంలో ఉంటుంది. 160చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంటుంది. తన గదిలో కింగ్​సైజ్ బెడ్, సోఫా, టీవీ ఉన్నాయి. స్నేహితుల కోసం కిందకు మెట్లు ఉండే ఇల్లును ఎంచుకున్నాడు.

private-tiny-house-village
బ్రాడీ ఇల్లు (ఇమేజ్ క్రెడిట్: లెనాక్స్ బ్రింక్స్)

లెనాక్స్ ఇల్లు
లెనాక్స్ ఇల్లు 160 చదరపు అడుగు విస్తీర్ణంలో ఉంటుంది. ఈమె ఇంటిలో ఒక సోఫా, టీవీ, డ్రెస్సర్, ఫుల్​ సైజ్ బెడ్ ఉంటుంది. లెనాక్స్ సాధారణ సమయాల్లో కాలేజీకి వెళుతుంది కాబట్టి కేవలం వారాంతరాల్లోనే ఇంట్లో గడుపుతుంది.

private-tiny-house-village
లెనాక్స్ ఇల్లు లోపలి భాగం.. (ఇమేజ్ క్రెడిట్: లెనాక్స్ బ్రింక్స్)

ఆఫీస్ కోసం ప్రత్యేకంగా
కెలి, తన భర్త ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు వీలుగా ప్రత్యేకంగా వారు ఒక చిన్న ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు.
'చిన్న ఇళ్లు ఉండటం వల్ల ఇంట్లో చెత్త తక్కువగా ఉంటుంది. మేం వారానికి ఒక చెత్త బ్యాగ్ మాత్రమే బయట వేస్తాము. మేము 'RRRR​' సూత్రాన్ని పాటిస్తాం. రిఫ్యూస్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే రూల్​ని పాటిస్తున్నాం. మేము ఎప్పుడూ ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించము. ఆహార వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఎరువులుగా మారుస్తాము. రీసైకిల్ అయ్యే వస్తువులన్నింటినీ మళ్లీ ఉపయోగిస్తుంటాం. మేము చాలా అరుదుగా బట్టలను ఆరబెట్టడానికి డ్రయ్యర్లను ఉపయోగిస్తుంటాం' అని కేలి చెప్పారు.

"మేము వారికి భూమి విలువ నేర్పించాము. దానిని జాగ్రత్తగా కాపాడేలా చూసేలా వారికి నేర్పించాము. కుటుంబం అంతా కలిసి ఉండటం, స్వచ్ఛమైన గాలి, ఆహారాన్ని పండించడం, జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం. ఇవన్నీ తర్వాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. దీనిని అందరూ పాటించాలని కోరుతున్నాం" అని కేలి చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.