ETV Bharat / international

మరోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష.. పది రోజుల్లో ఐదు సార్లు! - ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్‌ సర్కార్‌... మంగళవారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

NORTH KOREA MISSILE ATATCK ON JAPAN
NORTH KOREA MISSILE ATATCK ON JAPAN
author img

By

Published : Oct 4, 2022, 12:12 PM IST

Updated : Oct 4, 2022, 12:32 PM IST

అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్‌ సర్కార్‌... మంగళవారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో, బంకర్లలో తలదాచుకోవాలని ప్రజలకు జపాన్ ప్రభుత్వం సూచించింది. కొన్ని రైళ్లను కూడా రద్దు చేసింది. దక్షిణకొరియా, అమెరికా, జపాన్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం వల్ల ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ నుంచి 4,600 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి పడినట్లు జపాన్ తెలిపింది. ఈ ఏడాది ఉత్తర కొరియా సుమారు 40 క్షిపణులు పరీక్షించింది.

ఇదీ చదవండి: 8 నెలల పాప, తల్లిదండ్రులు కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు హైఅలర్ట్

ఆ మీడియా సంస్థపై ట్రంప్ పరువు నష్టం దావా.. 7,700సార్లు అలా అందని...

Last Updated : Oct 4, 2022, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.