ETV Bharat / international

Nobel Prize 2023 Chemistry : కెమిస్ట్రీలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్​ పురస్కారం

Nobel Prize 2023 Chemistry : Nobel Prize 2023 Chemistry : రసాయన శాస్త్రంలో అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్​ పురస్కారం వరించింది. మౌంగి బవెండి, లూయిస్​ బ్రూస్‌​, అలెక్సీ ఎకిమోవ్‌కు.. నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలకు గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం వెల్లడించింది.

Nobel Prize Winners 2023 In Chemistry
2023 Nobel Prize Laureates
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 3:44 PM IST

Updated : Oct 4, 2023, 5:04 PM IST

Nobel Prize 2023 Chemistry : నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్‌ బ్రూస్‌(80), అలెక్సీ ఎకిమోవ్‌(78)కు.. 2023కి నోబెల్‌ బహుమతిని స్వీడెన్​లోని స్టాక్​హోమ్​లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్స్‌ ప్రకటించింది.
నానో పార్టికల్స్‌, క్వాంటమ్‌ డాట్‌లను LED లైట్లు, టీవీ స్ర్కీన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్‌ కణజాలాన్ని తొలగించేందుకు సర్జన్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఈ సాంకేతికతనే వినియోగిస్తున్నారు. పరిశోధకులు ప్రధానంగా రంగు కాంతిని సృష్టించడానికి క్వాంటమ్ డాట్‌లను ఉపయోగించారు. భవిష్యత్తులో సరళమైన ఎలక్ట్రానిక్స్, మినిస్క్యూల్ సెన్సార్‌లు, సన్నని సోలార్‌ సెల్స్‌, ఎన్‌క్రిప్టెడ్ క్వాంటం కమ్యూనికేషన్‌కు క్వాంటం డాట్‌లు దోహదం చేస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. నోబెల్‌ బహుమతి విజేతలకు ఒక మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.

  • BREAKING NEWS
    The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8

    — The Nobel Prize (@NobelPrize) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"క్వాంటమ్‌ డాట్స్‌ అనేవి అతి సూక్ష్మమైన నానోపార్టికల్స్‌. వీటి ఆవిష్కరణ, అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. నానో టెక్నాలజీలోని ఈ క్వాంటమ్‌ డాట్స్‌ను ఇప్పుడు టీవీల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు అనేక పరికరాల్లో వాడుతున్నాం. డాక్టర్లు కూడా ట్యూమర్‌ కణాలను తొలగించేందుకు ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు."

- రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ

ప్రకటనకు ముందే పేర్లు లీక్​!
మరోవైపు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటనకు ముందే అవార్డు గ్రహీతల పేర్లు లీకవ్వడం చర్చనీయాంశమైంది. వారి పేర్లను స్వీడిష్‌ మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. రాయల్‌ స్వీడిష్ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి తమకు ప్రెస్‌ నోట్‌ అందిందని ఆ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెల్‌ గ్రహీతల పేర్లను ప్రకటించడానికి కొద్ది గంటల ముందే వారి పేర్లు బయటకువచ్చాయి. ఈ కథనాలపై అకాడమీకి చెందిన నోబెల్‌ కెమిస్ట్రీ కమిటీ నిపుణులు హీనెర్‌ లింకె స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అది తీవ్రమైన తప్పిదమే అని ఆయన పేర్కొన్నారు.

18 క్యారెట్ల బంగారంతో 'నోబెల్'​ బిల్ల!
నోబెల్​ పురస్కారాల ప్రకటన ప్రక్రియ ఈనెల 9 వరకు కొనసాగనుంది. కాగా, ఇప్పటివరకు వైద్యరంగం, భౌతిక శాస్త్రం, తాజాగా రసాయన శాస్త్రంలో ఈ అవార్డులను ప్రకటించారు. మిగిలిన విభాగాలైన ఆర్థిక శాస్త్రం, శాంతి, సాహిత్య రంగాల్లోనూ విశేష సేవలందించిన సైంటిస్టులకు నోబెల్​ను అందిచనున్నారు. ఇకపోతే ఈసారి నోబెల్​ ప్రైజ్​మనీని 10 శాతం మేర పెంచారు. అవార్డు గ్రహీతలు నగదు బహుమతితో పాటు డిసెంబర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో 18 క్యారెట్ల బంగారంతో చేసిన నోబెల్​ పతకంతో పాటు ధ్రువపత్రాన్నీ పొందుతారు.

అత్యంత రహస్యంగా ఓటింగ్​!
ప్రతిసంవత్సరం జరిగే నోబెల్‌ అవార్డుల ప్రకటన ప్రక్రియ అత్యంత రహస్యంగా జరుగుతుంది. పురస్కార గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే ఓ సమావేశాన్ని నిర్వహిస్తారు అవార్డు కమిటీ సభ్యులు. అందులో ఓటింగ్‌ నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అకాడమీ అఫీషియల్​గా విజేతల పేర్లను వెల్లడిస్తుంది. అంతేగాక ప్రతి విభాగంలో నామినేషన్ల జాబితాను కూడా 50 సంవత్సరాల వరకు గోప్యంగా ఉంచుతుంది అకాడమీ.

Nobel Prize 2023 In Medicine : కొవిడ్ టీకాల అభివృద్ధికి కృషి చేసిన వారికి నోబెల్

Nobel Prize In Physics 2023 : భౌతిక శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్​.. ఎల‌క్ట్రాన్ డైన‌మిక్స్​లోని ఆటోసెకండ్ పల్స్‌ అధ్యయనానికి..

Last Updated : Oct 4, 2023, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.